‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్ పై రాజమౌళి ప్రసంశలు

rajamouli
‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’ రాజమౌళి కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు. వీటి సక్సెస్ లో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించారు. రాజమౌళి ఊహను తెరపై అందంగా, పర్ఫెక్ట్ గా ఆవిష్కరించారు. ప్రస్తుతం వీరిద్దరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాకు పనిచేస్తున్నారు. ‘బాహుబలి’లో సెంథిల్ వర్క్ పట్ల రాజమౌళి చాలా సంతోషంగా ఉన్నారు.

పొగమంచు చాలా అందంగా ఉంది. వర్షం షూటింగ్ కు అనువుగా లేదు. అయినా సెంథిల్ కొన్ని మేజికల్ షాట్స్ తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వరంలో జరుగుతుంది.

ప్రభాస్, అనుష్క, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరలు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ మొదటి పార్ట్ 2015 ప్రధమార్ధంలో విడుదల కానుంది.

Exit mobile version