
యువ హీరో నాగ శౌర్య కెరీర్ లో సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సాయి కొర్రపాటి నిర్మాణంలో నిన్న విడుదలైన దిక్కులు చూడకు రామయ్య సినిమా ద్వారా మరోసారి మనల్ని పలకరించాడు. ఈ సినిమా చుసిన వాళ్ళు నాగ శౌర్య నటనను మెచ్చుకుంటున్నారు
ఈ యువ నటుడ్ని దర్శక దిగ్గజం రాజమౌళి కూడా కీర్తించడం విశేషం. “శౌర్య నటన నాకు చాలా నచ్చింది. తనకు మంచి భవిష్యత్తు వుందని” ట్విట్టర్ ద్వారా తెలిపారు. తదుపరి చిత్రంలో నాగ శౌర్య అవికా గొర్ సరసన నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘లక్ష్మి రావే మా ఇంటికి’ అనే టైటిల్ ని ఖరారు చేసారు