‘బాహుబలి’ బడ్జెట్ ఎంతో తెలుసా.?

Baahubali-pposter
ఇరు రాష్ట్రాల తెలుగు సినీ అభిమానులతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ మూవీ ‘బాహుబలి’. భారత చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా అత్యంత భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ టెక్నికల్ వాల్యూస్ కి ధీటుగా నిలిచేలా తెరకెక్కిన పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండడంతో ఈ చిత్ర టీం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందింది అంటున్నామే తప్ప ఎవ్వరికీ అసలు బడ్జెట్ అంత అనేది తెలియదు..

ఇదే విషయాన్ని రీసెంట్ ప్రమోషన్స్ లో ఈ సినిమా కెప్టెన్ ఎస్ఎస్ రాజమౌళి తెలియజేశాడు. ‘బాహుబలి రెండు పార్ట్స్ కలుపుకొని బాహుబలి బడ్జెట్ 250 కోట్లకి పైనే ఉంటుంది. మేము ఈ స్టొరీ లైన్ అనుకొని పూర్తి కథని డెవలప్ చేసుకున్నాక అర్థమైంది ఈ కథని మూడు గంటల్లో చెప్పలేం, అలాగే ఒక్క పార్ట్ తో ఇంత బడ్జెట్ ని రికవర్ చేస్కోలేమని అనుకున్నాం అందుకే ఇంకాస్త బడ్జెట్ పెంచి రెండు పార్ట్స్ గా ఈ సినిమాని తీసామని’ రాజమౌళి తెలిపాడు. ఆరడుగుల ఆజానుబాహులు ప్రభాస్ – రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుధీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version