టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ చాలా రోజుల తర్వాత వెండితెరపై ‘బైకర్’ చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇందులో శర్వానంద్‌కు తండ్రిగా ఆయన పోషించిన బుల్లెట్ సునీల్ అలియాస్ సునీల్ నారాయణ్ పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తన కొడుకు రేసింగ్ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తపించే తండ్రిగా రాజశేఖర్ నటన ఎంతో ఎమోషనల్‌గా సాగింది.
ఈ సినిమాలో రాజశేఖర్ కేవలం క్యామియో పాత్రకే పరిమితం కాకుండా, కథలో అత్యంత కీలకమైన లెంగ్తీ రోల్‌లో కనిపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. మరోవైపు, హీరో శర్వానంద్ మేకోవర్ మరియు రేసింగ్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మోటోక్రాస్ రేసింగ్ డ్రామాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ లభిస్తోంది. రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇలాంటి బలమైన పాత్రలు ఎంచుకోవడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
