సీనియర్ హీరో రాజశేఖర్ యాక్టర్ కాకముందు, డాక్టర్ అనే సంగతి తెలిసిందే. వైద్యుడైన ఆయన కుటుంబాన్ని కాదనుకుని మరీ సినిమాల్లోకి వచ్చి హీరోగా సక్సెస్ అయ్యారు. ఐతే, తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డాక్టర్ గా ఉండాలనుకుంటే ఇంట్లో ఉండు.. ఒకవేళ యాక్టర్ గా వెళ్లాలనుకుంటే ఇంటి నుంచి వెళ్లిపో అని తన తండ్రి తనను హెచ్చరించారని.. తాను ఇంటి నుంచి బయటకు వచ్చేశానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
అలాగే, తన కెరీర్ ప్రారంభ అనుభవాలను, తన ప్రేమ- పెళ్లి సంగతులనూ కూడా రాజశేఖర్ పంచుకుంటూ.. మొదట్లో నాకు నటి శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చింది. కానీ, అది జరగలేదు. ఇక తాను గోలీల ఫ్యాక్టరీ రన్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపైనా మరోసారి ఫన్నీగా రియాక్ట్ అవుతూ.. అవన్నీ అబద్దాలు అని హీరో రాజశేఖర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక రీసెంట్ గా రాజశేఖర్ ‘బైకర్’లో బుల్లెట్ సునీల్ నారాయణ్‌గా అలరించారు.
