మా అధ్యక్షుడుగా రాజేంద్రప్రసాద్

rajendhra-prasad
అత్యంత ఆసక్తికరంగానూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగానూ సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల్లో ప్రముఖ హాస్య నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించాడు. జయసుధ రాజేంద్రప్రసాద్ పోటాపోటీగా, ఎంతో సవాలుగా, వాదప్రతివాదాలతో, అంతే ఆరోపణలతో మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అసలు మొదట మా అధ్యక్షుడుని రాజేంద్రప్రసాద్ ను చేయాలని అంతా నిర్ణయించుకున్న తర్వతా జయసుధగారిని రంగంలోకి దింపి రాజేంద్రప్రసాద్ ని మోసం చేశారన్న విషయం వల్లనో ఏమో కానీ మొత్తానికి అంతుపట్టని ఓటింగ్ సరళి ఈ సారి గట్టిగానే పోలైంది. బలంగా నిజాయితీగా మొట్టమొదటే అనుకున్న వ్యక్తికే పట్టం కట్టింది. సత్యం అనేది చాలా గొప్పది అది ఎవరికీ అంతుపట్టనిదీ అన్న విషయం చాలా త్వరితగతిన అర్ధమైంది.

కాగా మార్చి 29 వతేదీన మా ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు మాత్రమే పోలైనవి. ఈసారి ఏవీయంల ద్వారా ఓటింగ్ జరిపారు. రాజేంద్రప్రసాద్ గారు జయసుధ గారి మీద 87 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Exit mobile version