డెబ్భై ఏళ్ళు వచ్చినా నటించేలా చేస్తుంది అదే- రజిని

rajini

దర్బార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శిల్ప కళావేదిక నందు గ్రాండ్ గా జరిగింది . ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజిని తో పాటు దర్శకుడు మురుగదాస్ హీరోయిన్ నివేదా థామస్ ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడిన రజిని కాంత్ డెబ్భై ఏళ్ల వయసులో కూడా మీ అభిమానం, ప్రేమ, ఆదరణ నటించేలా చేస్తుంది అన్నారు. 1976లో నా మొదటి చిత్రం అంతులేని కథ విడుదలైంది. అప్పటి నుండి భాషా భేదం లేకుండా నన్ను ఆదరిస్తున్నారు, తమిళ అభిమానులకు సమానం మీరు నన్ను అభిమానించడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ వేడుకలో రజిని ఆద్యంతం తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు.

దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఈనెల 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Exit mobile version