ఇక్కడ మహేష్,బన్నీ, పోటీపడుతుంటే అక్కడ రజిని, విశాల్, సూర్య…!

allu

ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాల పోరు ఆసక్తికరం. తెలుగువారి పెద్దపండుగ కావడంతో పాటు సౌత్ మొత్తం జరుపుకొనే అతిపెద్ద పండుగగా సంక్రాంతి ఉంది. దీనితో ప్రతి ఏడాది స్టార్ హీరోలు తమ చిత్రాలను సంక్రాంతికి విడుదల చేయడానికి ఇష్టపడతారు. టాలీవుడ్ 2020 సంక్రాంతి చిత్రాలు ఇప్పటికే నిర్ణయించబడ్డాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరూ, బన్నీ అలవైకుంఠపురంలో మరియు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా మూవీలు సంక్రాంతికి పోటీపడనున్నాయి.

ఇక మన పొరుగు పరిశ్రమ కోలీవుడ్ లో కూడా మూడు నుండి నాలుగు చిత్రాలు సంక్రాంతికి రానున్నాయి. సూపర్ స్టార్ రజిని ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న దర్బార్ మూవీని సంక్రాంతికి విడుల చేస్తున్నట్లు చాలా నెలల క్రితమే ప్రకటించేశారు. ఇక విశాల్, తమన్నా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్ మూవీ కూడా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నట్లు, తాజా సమాచారం. దీనితో పాటు సూర్య , మోహన్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సురారై పోట్రు కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. వీటితో పాటు కార్తీ నటిస్తున్న సుల్తాన్ అనే చిత్రం కూడా ఇదే సీజన్ కి విడుదలయ్యే అవకాశం కలదు.

Exit mobile version