‘లింగ’కి రజినీకాంత్ రెమ్యునరేషన్ 50 కోట్లు.!

rajnikanth

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హరోగా నటిస్తున్న సినిమా ‘లింగ’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఆడియో రిలీజ్ కార్యక్రమం ఈ రోజు చెన్నైలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఇది పక్కన పెడితే ప్రతి సినిమా అప్పుడు రజినీకాంత్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇంత తీసుకున్నారు అంటూ ఉంటారు. కానీ ఎవ్వరికీ కచ్చితంగా తెలియదు..

కానీ ‘లింగ’ విషయంలో మీకు రజినీకాంత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.. మా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రజినీకాంత్ ‘లింగ’ సినిమా కోసం 50కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. రజినీకాంత్ ఇమేజ్ పరంగా ప్రొడ్యూసర్ కి ఇంత కలెక్షన్స్ వసూలు చేసుకోవడం పెద్దపనేమీ కాదు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ లింగ సినిమాని 125 కోట్లకు ఈరోస్ వారికి అమ్మారు.

కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు.

Exit mobile version