నేను అలాంటి చవకబారు వ్యక్తిని కాదు – సూపర్ స్టార్

తమిళనాడు రాజకీయాన్ని యాభై ఏళ్లుగా శాసిస్తున్న ద్రవిడ పార్టీలకు దళపతి విజయ్ గట్టి షాక్ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించి, సీఎం అయ్యారు. ఐతే, తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం రజనీకాంత్ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ కలిశారు. దాంతో, సూపర్ స్టార్ రజనీకాంత్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. తాను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిశానని, అది విమర్శలకు దారితీసిందని రజనీకాంత్‌ తెలిపారు.

ఈ అంశం పై రజనీకాంత్ ఇంకా మాట్లాడుతూ.. ‘డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తో నా స్నేహం రాజకీయాలకు అతీతమైనది. ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. నేను అనవసరంగా ఇతర విషయాల గురించి మాట్లాడే చవకబారు వ్యక్తిని కాదు. అందుకే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్నికైన వెంటనే ఆయనకు అభినందనలు తెలియజేశాను అని విజయ్‌నుద్దేశించి రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

Exit mobile version