ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు కలిసి వస్తున్న కమల్, రజినీ.. అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ అదిరింది..!

Rajinikanth Kamal Haasan

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కలిసి ఓ సినిమా చేస్తే అది ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ ఎదురుచూపులకు తెరదించాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.

నెల్సన్ డైరెక్షన్‌లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించబోయే సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కమల్, రజినీ తమదైన స్వాగ్‌తో కనిపించి అభిమానులకు డబుల్ థ్రిల్ ఇచ్చారు. ఇక వారి లుక్స్ నుంచి వాకింగ్ స్టైల్ వరకు అన్నీ కూడా అదిరిపోయాయి. ఈ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లో నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కూడా కనిపించారు.

ఇద్దరు హీరోలను నెల్సన్ ఎలా హ్యాండిల్ చేస్తాడా అనే అనుమానాలకు ఈ గ్లింప్స్ వీడియోతో సాలిడ్ యాన్సర్ ఇచ్చాడు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎలాంటి పాత్రల్లో చూపిస్తాడా.. మిగతా క్యాస్టింగ్ ఎవరు ఉంటారా.. వంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఇప్పటికైతే కేవలం ఈ గ్లింప్స్ వీడియోతో అభిమానుల్లో అంచనాలను కూడా డబుల్ చేశారు మేకర్స్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version