నేడు భాగ్యనగరంలో సందడి చేయనున్న ‘లింగ’ టీం

lingaa-sencor
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ – కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లింగ’. ఈ సినిమా డిసెంబర్ 12న భారీ ఎత్తున విడుదలకి సిద్దమవుతోంది. లింగ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచి సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ఈ చిత్ర టీం కూడా సన్నాహలు చేస్తోంది.
ఇప్పటివరకూ తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్ర టీం ముందుగా తెలుగు నుండి ప్రమోట్ చెయ్యడం మొదలు పెడుతోంది. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో తెలుగు వెర్షన్ ‘లింగ’ ఆడియోని రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకి ఈ చిత్ర టీంలోని అందరూ హాజరు కావడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిధిగా వచ్చే అవకాశం ఉంది. ఆడియో లాంచ్ తో పాటు పలు రకాల ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ఈ చిత్ర టీం సిద్దమవుతోంది. నిన్న రాత్రే ఈ చిత్ర టీం మొత్తం హైదరాబాద్ చేరుకున్నారు.

సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

Exit mobile version