రాజమౌళి దర్శకత్వంలో నటిస్తా – రజినీకాంత్

rajamouli-and-rajinikanth
రాజమౌళికి ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడు అయ్యే అర్హతలు ఉన్నాయి. అతని దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నటిస్తాను. అని అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ‘లింగ’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రజిని ఈ వ్యాఖ్యలు చేశారు.

కేవలం ఆరు నెలల్లో ‘లింగ’ సినిమా చిత్రీకరణను దర్శకుడు కెఎస్ రవికుమార్ పూర్తిచేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పర్ఫెక్ట్ గా చేస్తే షూటింగ్ త్వరగా పూర్తి చేయవచ్చు. హాలీవుడ్ లో కూడా ఇదే తరహా పద్దతిని పాటిస్తున్నారు. ‘బాహుబలి’ డిఫెరెంట్ సినిమా. రెండేళ్ళ నుండి రాజమౌళి చాలా కష్టపడి సినిమాను తీస్తున్నారు. రాజమౌళికి ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడు అయ్యే అర్హతలు ఉన్నాయి. అతని దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నటిస్తాను. అల్లు అరవింద్ గారు సినిమా చేయమని అడుగుతున్నారు. ముందు చిరంజీవి 150వ సినిమాకు మంచి కథ ఇవ్వండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక ‘లింగ’ సినిమా విషయానికి వస్తే, చాలా మంచి కథ. రికార్డు టైంలో షూట్ చేశాం. అనుష్క, సోనాక్షి సిన్హా, రత్నవేలు, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఇలా టాప్ టెక్నీషియన్లు సినిమాకు పని చేశారు. సినిమా అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అని రజనికాంత్ అన్నారు. సూపర్ స్టార్ పుట్టిన రోజు, డిసెంబర్ 12న సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో అనుష్క, సోనాక్షి సిన్హా, రత్నవేలు, జగపతి బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, కె విశ్వనాధ్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version