
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లింగ’. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆ సాంగ్ ని దుబాయ్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ నవంబర్ 7న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ ని ఎరోస్ వారు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. గతంలో రజినీకాంత్ నటించిన ‘రోబో’, ‘శివాజీ’ సినిమాల ఆడియో రైట్స్ ప్రైజ్ కంటే ఎక్కువ మొత్తానికి ‘లింగ’ రైట్స్ అమ్ముడుపోయాయి.
ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాల తర్వాత రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.