
సూపర్ స్టార్ ఇటీవల’కాలా’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తెలుగులో అయితే ఈ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చింది.ఇక ఈ సినిమా తరువాత రజినీ తన కొత్త చిత్రాన్ని వెంటనే మొదలుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది. త్వరలోనే ఈ షెడ్యూల్ ముగించుకొని చిత్ర యూనిట్ మదురై కు వెళ్లనున్నారు.
ఇక రజినీ కాంత్ కు ఇదే చివరి సినిమా కానుంది. ఇటీవల రాజకీయ పార్టీ ని స్థాపించిన ఆయన ఈ చిత్రం తరువాత సినిమాలకు స్వస్థి చెప్పి రాజకీయాలకు అంకింతం కానున్నారు. వీలైనంత తొందరగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి తలైవా తన పార్టీ పనుల్లో నిమగ్నం కానున్నారు.