
సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటినటులుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లింగ’. దుబాయ్ లో రజినీకాంత్ పై చిత్రీకరిస్తున్న ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ నేటితో పూర్తయింది. టాకీ పార్ట్, మిగతా పాటల చిత్రీకరణ ఎప్పుడో పూర్తి చేశారు. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవడంతో ‘లింగ’ సినిమాకు రజినీకాంత్ & టీం గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమాలో రజిని ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఇటివల విడుదలైన ‘లింగ’ టీజర్ కు విశేషమైన స్పందన లభించింది. స్వర మాంత్రికుడు ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన ‘లింగ’ ఆడియోను నవంబర్ 9న విడుదల చేయనున్నారు. రజినీకాంత్ బర్త్ డే కానుకగా సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మించారు.