ఒక నెల వాయిదాపడ్డ రజినీకాంత్ నెక్స్ట్ మూవీ

ఒక నెల వాయిదాపడ్డ రజినీకాంత్ నెక్స్ట్ మూవీ

Published on Aug 9, 2015 1:51 PM IST

rajinikanth
‘లింగ’ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే యంగ్ డైరెక్టర్ అయిన పిఎ రంజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత నెల రోజులపై నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోంది. ముందుగా అనుకున్న దానిప్రకారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆగష్టు 18 నుంచి మలేషియాలో మొదలవ్వాలి, కానీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వాయిదా పడింది. తమిళ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 18న రజినీ మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాని ఈ సినిమాలో రజినీకాంత్ ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. అది కూడా తన వయసుకి సరిపోయే పాత్రని సమాచారం. రాజింకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి పలువురు యంగ్ టాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేయనున్నారు. రజినీకాంత్ షూటింగ్ మొదలు పెట్టిన 45 రోజుల్లో తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ రానో 2 సినిమాకి షిఫ్ట్ అవుతాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు