ముఖ్య అంశాలు
- సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమాకు ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు.
- ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ తన ప్రతిష్టాత్మక ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
- యువ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజనీకాంత్ యాక్షన్ డాక్టర్‌గా అదరగొట్టారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాలిడ్ అప్‌డేట్ రానే వచ్చింది. తలైవర్ 173వ సినిమాకు సంబంధించి మేకర్స్ అఫీషియల్‌గా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ పేరును ఫిక్స్ చేస్తూ, సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టారు. ఈ అనౌన్స్‌మెంట్ రాగానే ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా భారీ బజ్ క్రియేట్ అయింది.
ఈ సినిమాకు సంబంధించి అభిమానులను అత్యంత ఆకర్షిస్తున్న మరో విషయం.. ఇండియన్ సినిమాలోని ఇద్దరు దిగ్గజాలు మళ్లీ కలుస్తుండటం. తెరపై ఇద్దరూ కలిసి నటించకపోయినా, కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా, కమల్ నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇద్దరి ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్‌గా మారింది.
యాక్షన్ డాక్టర్‌గా సూపర్ స్టార్
టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటే మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రజనీకాంత్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఒక పవర్‌ఫుల్ డాక్టర్‌గా, ఎవరినైనా దీటుగా ఎదిరించే యాక్షన్ పర్సనాలిటీగా ఆయన కనిపిస్తున్నారు. పక్కా యాక్షన్ వైబ్స్‌తో ఉన్న ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. డెడ్లీ డాక్టర్‌గా స్క్రీన్‌పై రజనీకాంత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవలే ‘డ్రాగన్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యువ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే సినీ ఇండస్ట్రీలోని అతిపెద్ద స్టార్స్‌తో పనిచేసే అరుదైన అవకాశం ఈ యంగ్ డైరెక్టర్‌కు దక్కింది. ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ టీమ్, రాబోయే రోజుల్లో ఇంకెన్ని సర్ప్రైజ్‌లు ఇస్తుందో చూడాలి.
