ఈనెల్లోనే సెట్స్‌పైకి రజనీ సినిమా

rajinikanth
సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా అంటే బాక్సాఫీస్‌కు పండగే. అయితే ఆయన గత చిత్రాలైన ‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసి రజనీకి పెద్ద పరీక్ష పెట్టాయి. దీంతో కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో రజనీ.. ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే. రాధికా ఆప్టే ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. రజనీకి కచ్చితంగా హిట్ కొట్టి తీరాలన్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో రజనీ కాంత్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం.

Exit mobile version