యువ దర్శకుడితో రజనీ కొత్త సినిమా !

సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయడమనేది పెద్ద దర్శకులకు కూడ పెద్ద డ్రీమ్ లాంటిది. ఇప్పటికీ ఎందరో బడా దర్శకులు ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి గొప్ప అవకాశం ఒక యువ దర్శకుడికి దక్కింది. అతను మరెవరో కాదు కార్తిక్ సుబ్బరాజ్.

మొదటి చిత్రం ‘పిజ్జా’తోనే అందరి ప్రశంసలు అందుకున్న ఆయన ఆ తరవాత ‘జిగర్తాండ, ఇరైవి’ వంటి చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకులను మెప్పించారు. అలా ఆయన కథ చెప్పి రజనీని ఒప్పించారు. ‘కాలా. 2 పాయింట్ 0’ విడుదల తర్వాత రజనీ చేయబోయే సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తుండటం ఇంకో గొప్ప విషయం.

Exit mobile version