తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో ఓ సరికొత్త కథాంశంతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా నిర్మించడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ వర్షన్ ఆడియోను మే 8నే విడుదల చేశారు.
తాజాగా తెలుగు వర్షన్ ఆడియో రిలీజ్‌కు సంబంధించి కూడా ఓ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘రాక్షసుడు’ టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈనెల 18న తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఆడియోను హైద్రాబాద్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు సూర్యతో పాటు సినిమా యూనిట్ హాజరు కానున్నారు. ఇక నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
