‘రాక్షసుడు’ రన్‌టైమ్ వివరాలివీ!

Rakshasudu
సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూన్న మాస్ (రాక్షసుడు) సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయ్. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తైన విషయం తెలిసిందే. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా నిడివి 2 గంటల 32నిమిషాలు. ‘మాస్’ సినిమా దయ్యం నేపథ్యంలో నడిచే ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అయినా పిల్లలు కూడా నిరభ్యంతరంగా చూడగలిగేలా తెరకెక్కిందని సూర్య చెబుతూ వస్తున్నట్టుగానే ఈ సినిమాకు క్లీన్ యూ లభించడం విశేషం.

ఈ మధ్య కాలంలో తెరకెక్కిన పెద్ద తమిళ సినిమాలతో పోలిస్తే మాస్ నిడివి తక్కువే! ఈ విషయం సాధారణ ప్రేక్షకుడి పరంగా ఆలోచిస్తే కలిసివచ్చే అంశం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చగా సినిమా యూనిట్ కూడా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టి సినిమాను ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు. మే 29న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే!

Exit mobile version