
నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో మంచు మనోజ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కరెంటు తీగ అనే టైటిల్ ఈ చిత్రానికి పెట్టె ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ మొదలైన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో రాకుల్ ప్రీత్ సింగ్ మంచు మనోజ్ తో జతకట్టనుంది.
షూటింగ్ మొదలైన దాదాపు వారం రోజుల తరువాత రాకుల్ ఈ చిత్ర బృందంతో కలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. వారం రోజుల క్రితం వరకు శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తో జరిగిన షూటింగ్ లో ఆమె పాల్గొన్నారు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ చిత్రంలోని అగ్రభాగం దాదాపు జైపూర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్ర కధాంశం ప్రకారం రాకుల్ ప్రీత్ సింగ్ ఓ తెలుగమ్మాయి పాత్రను ఈ చిత్రంలో పోషిస్తోంది. మనోజ్, రాకుల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.