రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలో 20 లక్షల మంది..

Rakulpreethi-sing
వరుస అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇతర హీరోయిన్లకు గట్టి పోటి ఇస్తున్న ఎక్స్ ప్రెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతుంది. ఈ అమ్మడి అఫీషియల్ పేస్ బుక్ పేజిను ఫాలో అయ్యేవారి సంఖ్య 20 లక్షలు(2 మిలియన్స్) దాటింది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. కాజల్ అగర్వాల్, తమన్నా వంటి తారలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. అయితే విడుదలైన ఒక్క సినిమాతోనే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం గ్రేట్ అని చెప్పాలి.

అవకాశాలు సొంతం చేసుకోవడంలో రకుల్ ప్రీత్ సింగ్ జోరు చూస్తుంటే వచ్చే నాలుగైదు ఏళ్ళ పాటు తెలుగు తెరపై అగ్ర హీరోయిన్ గా వెలుగొందడం ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఢిల్లీ బొమ్మ నటించిన ‘లౌక్యం’ సెప్టెంబర్ 26న విడుదలవుతుంది. తర్వాత మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’, ఆది ‘రఫ్’ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. రామ్ ‘పండగ చేస్కో’ సినిమా సెట్స్ పై ఉంది. త్వరలో రవితేజ ‘కిక్ 2’ షూటింగ్ ప్రారంభమవుతుంది.

పైన చెప్పిన సినిమాలు విజయం సాదిస్తే రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. మరోవైపు హిందీలో కూడా పెద్ద దర్శకుల సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

Exit mobile version