గోల్డెన్ ఛాన్స్ పట్టేయనున్న రకుల్ ప్రీత్

Rakul9

తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన తలపతి విజయ్ తన 63వ చిత్రంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన లోకేష్ భాగ్యరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈయన గతంలో హీరో సందీప్ కిషన్ తో “నగరం” అనే సినిమాని తెరకెక్కించారు.

ఐతే ఈ మూవీలో విజయ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరును నిర్మాత,దర్శకుడు పరిశీలిస్తున్నారట. ఈ మేరకు త్వరలో రకుల్ తో చర్చలు జరిపే అవకాశం కలదు అని సమాచారం.రకుల్ గతంలో విజయ్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తన మనసులో మాట చాలా సందర్భాలలో బయటపెట్టింది. కాబట్టి ఈ సినిమాలో అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకోవడం ఖాయం. తాజాగా రకుల్ సూర్య “ఎన్ జి కె” లో కనిపించగా,నాగార్జునతో తెలుగులో చేసిన “మన్మధుడు2” ఆగస్టులో విడుదల కానుంది.

Exit mobile version