
తెలుగులో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయిన భామ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ‘పండగ చేస్కో’తో విజయాన్ని సొంతం చేసుకున్న రకుల్, ప్రస్తుతం చేతిలో మూడు పెద్ద ప్రాజెక్టులను పెట్టుకొని బిజీబిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమా షూటింగ్లో తన భాగాన్ని పూర్తి చేస్తూనే.. ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమా, అల్లు అర్జున్-భోయపాటి శ్రీనుల సినిమాలతో మరింత బిజీ కానుంది.
‘టెంపర్’ సినిమా హిట్‌తో జోరు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఈరోజే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఈ రోజే మొదలవ్వనున్న షెడ్యూల్ కోసం ఇప్పటికే సినిమా యూనిట్ లండన్ చేరుకుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ఎగ్జైటింగ్‌గా ఉన్నానని, కొత్త టీమ్‌తో, ఓ కొత్త ప్రయాణం మంచి అనుభూతినిస్తుందని కోరుకుంటున్నానని రకుల్ ప్రీత్ ఈ సందర్భంగా తెలిపింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అన్న టైటిల్ పరిశీలనలో ఉంది.