
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’ మరియు ‘కరెంట్ తీగ’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ వరుస హిట్స్ తో ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆ షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. అభినయంతో పాటు గ్లామరస్ గా కనిపించడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడంతో రోజు రోజుకీ ఆఫర్స్ పెరిగిపోతున్నాయి.
కానీ ఇలా వరుస సినిమాలు ఒప్పుకోవడంతో గ్లామరస్ లేడీ రకుల్ ప్రీత్ షెడ్యూల్స్ అన్నీ బాగా బిజీ అయిపోయాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఒప్పుకున్న అన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో రకుల్ ప్రీత్ ఇబ్బంది పడుతోంది. దాంతో రకుల్ ప్రీత్ ప్రస్తుతం వస్తున్న ఆఫర్స్ లో స్క్రిప్ట్స్ విని చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోంది.
ఒకేసారి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒప్పుకొని ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసుకుంటోంది. ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ అయితే కెరీర్ ఒక్కసారోగా టర్న్ అయిపోతుంది. ప్రస్తుతం రాకుల్ ప్రీత్ సింగ రఫ్, పండగ చేస్కో మరియు కిక్ సినిమాల్లో నటిస్తోంది.