ఆది ‘రఫ్’ సీక్రెట్ ని బయటపెట్టిన రకుల్

Rakul-Preet
యువ నటుడు ఆది వరుసపెట్టి ఆసక్తికరమైన సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు . ఈసారి యాక్షన్ జోనర్ ని ఎంచుకుని ఈ వారంతరం ‘రఫ్’ సినిమా ద్వారా మనముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లు ప్రేక్షకాధారణ పొందుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ చిత్రానికి సంబంధించిన అససక్తికరమైన అంశం బయటపెట్టింది

నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ సంతకం చేసిన మొదటి తెలుగు సినిమా ‘రఫ్’ అట. సినిమా నిర్మాణానికి చాలా సమయం పట్టిందని, అయితే అవుట్ పుట్ చూసి సంతోషించిందని కూడా తెలిపింది. ఈ సినిమాకోసం ఆది వర్క్ అవుట్ చేసి సిక్స్ ప్యాక్ తో అలరించనున్నాడు. రఫ్ సినిమాను సుబ్బారెడ్డి తెరకెక్కించాడు. అభిలాష్ మాధవరం నిర్మాత

Exit mobile version