
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’, ‘పండగ చేస్కో’ లాంటి వరుస విజయాలతో సూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ గా మారిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ నటించిన కిక్ 2 సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంటే, మరో వైపు రకుల్ హీరోయిన్ గా నటించనున్న రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళే పనిలో ఉన్నాయి. వీరితో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా నటించే అవకాశం రకుల్ ప్రీత్ ని వరించింది. కానీ చివరికి ఆ అవకాశాన్ని మిస్ చేసుకొని, మిస్ అయిపోయానని బాహ్డ పడుతోంది.
మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఆఫర్ గురించి రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ‘ నేను మహేష్ బాబుతో నటించాలని ఎంతో ఇష్టపడ్డాను. కానీ ఆ మూవీ మేకర్స్ జూలై లోనే కాల్షీట్స్ కావాలని అడిగారు. కానీ జూలై మొత్తం ఎన్.టి.ఆర్ , రామ్ చరణ్ సినిమాలకు డేట్స్ ఇచ్చేశాను. చివరికి చేసేదేమీ లేక మహేష్ సినిమా వదులుకున్నాను. ఇది బాధాకరమైన విషయమని’ తెలిపింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. త్వరలోనే ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది.