టీజింగ్ సాంగ్ షూట్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్

shivam
‘పండగ చేస్కో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ త్వరలోనే ‘శివమ్’ అనే హై వోల్టేజ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఇటీవలే యూరప్ లో రెండు పాటలను పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చింది. ఇక ఫైనల్ గా మిగిలి ఉన్న రెండు పాటల్లో ఒక పాటని ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. హీరోయిన్ ని టీజ్ చేస్తూ వచ్చే ఈ పాటని రామ్ – రాశి ఖన్నాలపై షూట్ చేస్తున్నారు.

‘ప్రేమ అనే ఒక పిచ్చి.. నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి’ అనే ఈ పాటకి కొరియోగ్రాఫర్ జానీ డాన్స్ మోమెంట్స్ కంపోజ్ చేస్తున్నాడు. సినిమాలో వచ్చే ఈ టీజింగ్ సాంగ్ షూటింగ్ చాలా ఫన్నీగా ఉందని, షూట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నామని, దేవీశ్రీ ప్రసాద్ – లిరిసిస్ట్ భాస్కర భట్ల కలిసి చాలా మంచి సాంగ్ ఇచ్చారని రామ్ తెలిపాడు. ఈ సాంగ్ షూట్ ఫినిష్ అయిన తర్వాత రామ్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 12న హైదరాబద్ లో జరగనుంది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

Exit mobile version