గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పోలీస్ గా రామ్ చరణ్..?

Ram-charan-goutham-menon
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే చరణ్ తన హెయిర్ స్టైల్ చేంజ్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం అజిత్, త్రిష, అనుష్క నటినటులుగా ఓ తమిళ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చరణ్ సినిమా ఉంటుందని టాక్. ఆల్రెడీ, ఈ తమిళ దర్శకుడు చరణ్ కోసం కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ‘గోవిందుడు..’ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఇదేనని సమాచారం.

పోలీస్ కథలను వెండి తెరపై ఆవిష్కరించడంలో గౌతమ్ మీనన్ శైలి సెపరేట్. ‘ఘర్షణ’లో వెంకటేష్, ‘రాఘవన్’లో కమల్ హాసన్ లను పోలీసులుగా చూపించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘జంజీర్’ (తెలుగులో ‘తుఫాన్’గా డబ్ చేశారు)లో ఖాకీ డ్రెస్ వేసుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అయినా చరణ్ ఖాకీ లుక్ కు మంచి స్పందన వచ్చింది.

Exit mobile version