
సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది.. కట్ చేస్తే నడి సముద్రంలో ఓ పెద్ద షిప్.. ఆ షిప్ లో సినిమాకి మెయిన్ విలన్ హీరోని వేసేయ్యడానికి తన గ్యాంగ్ తో సిద్దంగా ఉన్నాడు. కానీ హీరో వచ్చి విలన్ గ్యాంగ్ ని చితకబాదడమే కాకుండా అక్కడి నుంచి అక్కడి నుంచి తనకి కావాల్సింది తీసుకొని బోట్ లో జంప్ అవుతాడు.. కానీ వెనకాలే విలన్స్ గ్యాంగ్ వెంబడిస్తోంది.. ఆ చేజింగ్ లో వారందరినీ సముద్రంలో ముంచేసి ఫైనల్ గా కథని సుఖాంతం చేసాడు మన హీరో.. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఈ బ్లాక్ ఏ సినిమాలోనిది అనుకుంటున్నారా.? ఇప్పుడు మేము చెప్పిన ఈ సీన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలోనిది.
రామ్ చరణ్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం పట్టాయ నుంచి కొంత దూరం సముద్రం లోకి వెళ్లి అక్కడ ఓ షిప్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఆ ఫైట్ తో పాటే క్లైమాక్స్ లో వచ్చే ఓ బోట్ చేజింగ్ సీక్వెన్స్ ని కూడా షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కి అనల్ అరసు ఫైట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వారం రోజులు అక్కడే షూటింగ్ జరగనుంది. మొత్తం సముద్రంలో షూట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. నదియా, కృతి కర్భంద, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.