రామ్ చరణ్‌కు ఏమీ కాలేదు.. బాగానే ఉన్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుండి చరణ్ చిత్రీకరణ చేస్తుండగా గాయపడినట్టు వార్తలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశాయి. గతంలో కూడా చరణ్ గాయపడి ఉండటంతో ఈ వార్తలు నిజమేమోనని అభిమానులు కంగారుపడ్డారు.

దీంతో స్పందించిన చిత్ర సన్నిహిత వర్గాలు చరణ్ గాయపడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆయన బాగానే ఉన్నారని, నిన్న, ఈరోజు జరిగిన చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారని స్పష్టం చేశాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే రాజమౌళి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. సుమారు రూ.350 కోట్ల వ్యవయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి కూడా తీసుకెళుతున్నారు.

Exit mobile version