మూగజీవులపై మరోసారి ప్రేమను చూపించిన రామ్ చరణ్

మూగజీవులపై మరోసారి ప్రేమను చూపించిన రామ్ చరణ్

Published on Jun 26, 2014 8:25 AM IST

ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మూగ జీవుల ప్రేమికుడని అందరికీ తెలుసు. తను పెంచుకున్న పెంపుడు జంతువులని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇటీవలే రామ్ చరణ్ చేసిన మరో సంఘటన ఆయన జంతుప్రీతికి ఉదాహరణగా నిలిచింది

మొన్న రామ్ చరణ్ ఇంటిలోకి ఒక పెద్ద ర్యాట్ స్నేక్ వచ్చింది. మామోలుగా ఎవరైనా ఇటువంటి పాముని చూస్తే కొట్టి చంపేస్తారు. కానీ చరణ్ తన ఇంట్లోవాళ్లతో ఆ పాముని ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్’ సంస్థకి అప్పగించడంతో ఆ పాముని భద్రంగా అడవిలోకి వదిలిపెట్టనున్నారు

ప్రస్తుతం చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ లో మనముందుకు రానుంది

తాజా వార్తలు