ఏ నిర్మాతకి అయినా కూడా తమ బ్యానర్ నుంచి మొట్టమొదటి ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రత్యేకం. మరి అదే మెగా హీరో నుంచి తన బ్యానర్ మొదటి సినిమా అంటే ఆ హై నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అలాంటి హై తోనే వస్తున్న నిర్మాతే వెంకట సతీష్ కిలారు. తమ బ్యానర్ వృద్ధి సినిమాస్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా కలయికలో చేసిన భారీ చిత్రం “పెద్ది” తో నిర్మాత పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి ముందు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో ఇప్పుడు చూద్దాం రండి.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. రేపు వచ్చే ట్రైలర్ ఎలా ఉండబోతుంది?
ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు మరింత పెరుగుతాయి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు వెంటనే సినిమా చూడాలని అనుకుంటారు. టైటిల్ కార్డ్స్ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులు సీట్ నుంచి కదలలేరు. అంత ఫుల్ ప్యాక్డ్గా సినిమా ఉంటుంది. ‘పెద్ది’ని చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా, ఓవర్సీస్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.
‘పెద్ది’లో సుకుమార్ గారి ప్రమేయం ఏమన్నా ఉందా?
సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోవడం లేదు. కథ నుంచి మొత్తం బుచ్చిబాబు గారే చూసుకున్నారు. కథ విషయంలో ముందుగా ఆయన గురువుగారు సుకుమార్ గారితో షేర్ చేసుకుని ఉండొచ్చు ఏమో కానీ షూటింగ్ మొదలైన తర్వాత మొత్తం బుచ్చిబాబు గారే చూసుకున్నారు.
శివరాజ్ కుమార్ గారి కోసం చెప్పండి?
శివరాజ్ కుమార్ గారు, జగపతిబాబు గారు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, టీను ఆనంద్… ఇలా ప్రతి క్యారెక్టర్ కథతో బలంగా ముడిపడి ఉంటుంది. ఆ పాత్రల్లో వాళ్లు జీవించేశారు. ప్రతి క్యారెక్టర్ ఇంపాక్ట్‌ను ప్రేక్షకులు బలంగా ఫీల్ అవుతారు.
ఛాయాగ్రాహకుడు రత్నవేలు గారి గురించి?
రత్నవేలు గారు ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. ఇది 80ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన సెట్లు వేశారు. ‘పెద్ది’ కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. శ్రీలంక, పూణే, ఢిల్లీ వంటి రియల్ లొకేషన్స్‌లో కూడా షూట్ చేశాం.
రిలీజ్‌కు ముందు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు
మా కంటెంట్‌పై చాలా నమ్మకం ఉంది. అదే మాకు కాన్ఫిడెన్స్ ఇస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరుగుతుంది.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
బాలకృష్ణ గారితో సినిమా నడుస్తోంది.
