మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తన సోదరి నిహారిక పెళ్లి వేడుకల్లో ఉన్నారు. కుటుంబంతో కలిసి రాజస్థాన్లో ఉన్నారు. ఈ పెళ్లి వేడుక కోసమే ఆయన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ నుండి బ్రేక్ తీసుకున్నారు. ఇంకో మూడు నాలుగు రోజుల్లో అన్ని పనులు ముగించుకుని ఆయన తిరిగి సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారట. జనవరి వరకు ఆ సినిమా షూటింగ్లోనే పాల్గొంటారని తెలుస్తోంది. జనవరి నుండి మళ్ళీ ‘ఆచార్య’ సెట్లోకి ఎంటరవుతారట.
తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ‘ఆచార్య’లో చరణ్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనకు జోడీగా హీరోయిన్ కూడ ఉండనుంది. ఈ సినిమా కోసం కొన్నిరోజులు డేట్స్ ఇచ్చారు ఆయన. దశల వారీగా కాకుండా తనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని చరణ్ ఒకేసారి పూర్తిచేయనున్నారు. అది పూర్తయ్యాకే మళ్ళీ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి వెళతారట. చరణ్ ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన మళ్ళీ మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి సింగిల్ షెడ్యూల్లోనే ఆయన పార్ట్ పూర్తిచేయాలని కొరటాల శివ కూడ భావిస్తున్నారట. ఈ రెండు చిత్రాల్లో ‘ఆచార్య’ వేసవికికి ప్రేక్షకుల ముందుకు రానుండగా ‘ఆర్ఆర్ఆర్’ దసరా కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.
