‘ధురంధర్ 2’ పై మెగా పవర్ స్టార్ ఫిదా..!

Dhurandhar 2

కేవలం సాధారణ ప్రేక్షకులనే కాకుండా, సినీ ప్రముఖులను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది రణవీర్ సింగ్ మరియు ఆదిత్య ధర్ ల సెన్సేషనల్ మూవీ ‘ధురందర్: ది రివెంజ్’. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మరియు మహేష్ బాబు ఈ చిత్రాన్ని ప్రశంసించగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ బాక్సాఫీస్ ‘మాన్‌స్టర్’ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

​ఈ చిత్రం గురించి రామ్ చరణ్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. “ధురందర్: ది రివెంజ్ చాలా రా గా, గ్రిప్పింగ్‌గా మరియు ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. దర్శకుడు ఆదిత్య ధర్ స్కేల్ మరియు ఎమోషన్‌ను అద్భుతంగా మిక్స్ చేశారు. రణవీర్ సింగ్ తన ఇంటెన్సిటీతో ఫినామినల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాధవన్ సార్, సంజయ్ దత్ సార్, మరియు అర్జున్ రాంపాల్ తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు” అని కొనియాడాడు.

​అంతేకాకుండా, సారా అర్జున్ నటన మరియు శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సినిమాను ఎలివేట్ చేశాయని చరణ్ పేర్కొన్నాడు. ఇలాంటి ఒక రివెటింగ్ సినిమాను అందించిన జియో స్టూడియోస్ మరియు జ్యోతి దేశ్ పాండేలకు అభినందనలు తెలుపుతూ, చిత్ర బృందం మొత్తానికి తన శుభాకాంక్షలు అందజేశాడు. ప్రస్తుతం చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version