మహానటి ఫై ప్రముఖుల ప్రశంసలు ఇంకా కొనసాగుతూనేఉన్నాయి . దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరు మహానటిని ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా ఈజాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయారు.
కాస్త ఆలస్యంగా మహనటి సినిమా చూసిన అయన ఫేస్ బుక్ ద్వారా స్పందించారు . ఈ సినిమా ఎమోషనల్ గా చాలా టచ్ చేసిందని ప్రేమతో,గౌరవంగా ఇంత అద్భుతమైన సినిమాని తీసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలు చెబుతూ కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించారని ఇంతకన్నా ఈ పాత్రను భాగా ఎవరు చేయలేరు అని అలాగే ఈ చిత్రంలోని మిగితా నటీనటులు దుల్కర్ సల్మాన్ , సమంత, విజయ్ దేవరకొండలు కూడా చాల బాగా చేశారని పేర్కొంటూ ఈ చిత్ర నిర్మాతలైన ప్రియాంక దత్ అశ్విన్ దత్ లకు శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్.
