తాను ఎలాంటి తండ్రినో చెప్పిన రామ్ చరణ్.. పేరెంటింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇప్పటికే క్లింకార అనే కూతురు ఉండగా, రీసెంట్‌గా శివ రామ్, అన్వీర దేవి అనే కవలలు పుట్టారు. ప్రస్తుతం తమ కుటుంబం ఈ చిన్నారులతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. తాజాగా ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ పేరెంటింగ్ స్టైల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఒక ‘రఫ్ ఫాదర్’ అని ఆయన పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.

తన పిల్లలు పిల్లలు ధైర్యంగా, సాహసంగా పెరగాలని కోరుకుంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. క్లింకార,శివ రామ్, అన్వీర దేవి లతో సమయం గడపడానికే తాను ప్రాముఖ్యత ఇస్తానని ఆయన తెలిపాడు. తన ప్రపంచం అంతా కుటుంబం మరియు పెంపుడు జంతువులేనని ఆయన అన్నాడు.

ఇక సినిమాల పరంగా రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ చిత్రంలో పెహిల్వాన్‌గా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version