పెద్ది : రామ్ చరణ్ కాన్ఫిడెంట్.. ఇది మామూలు సినిమా కాదు..!

విజయవాడలో జరిగిన ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కథపై ఉన్న ఇష్టంతోనే ఎంత కష్టమైనా మర్చిపోయి నటించానని ఆయన చెప్పాడు.

చరణ్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు బుచ్చిబాబు ఈ కథను ఒక వ్యక్తి జీవిత ప్రయాణంగా చెప్పాడు. ఇది మామూలు సినిమా కాదు.. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ పట్టుదలగా పైకి లేచిన ఒక వ్యక్తి పోరాటం. నాకు గతంలో ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలప్పుడు ఎలాంటి ఉత్సాహం ఉండేదో, మళ్లీ ‘పెద్ది’ కి అదే ఫీలింగ్ కలిగింది. మా నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి హృదయాన్ని కదిలించే కథలు పదేళ్లకు ఒకసారే వస్తాయి’ అని అన్నాడు.

నటుడిగా ఈ సినిమా తనకు పూర్తి తృప్తినిచ్చిందని.. తన అభిమానుల నమ్మకం, ప్రోత్సాహం వల్లే తాను ఈ చిత్రం చేయగలిగానని.. తనకు సినిమా తప్ప మరేమీ తెలియదని రామ్ చరణ్ తెలిపాడు.

Exit mobile version