చిరు బర్త్ డేకి రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

Ram-charan1
గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఓ కమర్షియల్ సినిమాకి ఫుల్ కామెడీని జోడించి చెప్పగల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్, థాయ్ ల్యాండ్ లలో జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ పై క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్, రావు రమేష్, సాయాజీ షిండేల్పి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సుమారు 50% పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయే టైటిల్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఈ చిత్ర టీం ఉన్నారు.

ఇప్పటికే బ్రూస్ లీ, ఫైటర్, విజేత అనే టైటిల్స్ ని పరిశీలించే పనిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఓ స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేస్తున్నారు. అదే తన 9వ సినిమా అఫీషియల్ టైటిల్ ని అనౌన్స్ చేయడమే కాకుండా, అఫీషియల్ ఫస్ట్ టైటిల్ లోగోని కూడా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. అలాగే చిరు 150వ సినిమాకి సంబందించిన ఆసక్తికర విషయాలను కూడా అనౌన్స్ చేయనున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కృతి కర్భంద, నదియా ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

Exit mobile version