ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – నాన్న గారికి ఏ నిర్మాత ఇవ్వని రెమ్యునరేషన్ ఇచ్చాను !

రంగస్థలం తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మెగా పవర్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం జనవరి 11న విడుదలవుతున్న సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు . ఆయన ఏమ్మన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఈచిత్రంలో మీ పాత్ర గురించి ?

ఈ సినిమాలో రామ్ పాత్రలో నటించాను. ప్రతి ఇంట్లో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అనుకునే పాత్ర నాది. రాముడు టైప్లో వినయంగా వుంటూ అవసరమైతే విధ్వసం కూడా సృష్టించే టైప్ లో ఉంటుంది ఈ పాత్ర.

రంగస్థలం తరువాత ఈ జోనర్ లోనే చేయాలని అనుకొన్నారా ?

ఒక నటుడు గా ఒక దానికే పరిమితం కాకూండా అన్ని జోనర్లు లలో సినిమా ను చేయాలనేదే నా ఉద్దేశం. 1980లో నాన్న గారు కూడా అన్ని జోనర్లలో సినిమా లు చేశాడు. జోనర్ కంటే కూడా ఒక సెన్సబుల్ సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా ను అంగీకరించాను.

బోయపాటి సినిమాలంటేనే లార్జర్ దెన్ లైఫ్ లా ఉంటాయి. మరి యాక్టర్ గా ఈ పాత్రలోకి మారడానికి కష్టమనిపించిందా ?

నాకు ఇంకా సమయం ఉంటే బాగుండేది అనిపించింది. రంగస్థలం షూటింగ్ అయిపోయాక 25వ రోజుల గ్యాప్ లో ఈ చిత్ర షూటింగ్ ను మొదలు పెట్టాం. బోయపాటికి వున్న కమిట్మెంట్స్ అలాగే నా కమిట్మెంట్స్ వల్ల సినిమా షూటింగ్ ను తొందరగా మొదలు పెట్టాం. అయితే డైరెక్టర్ కు ఉన్న క్లారిటీ వల్ల నాకు ఈ పాత్ర చేయడం పెద్ద కష్టమేమి అనిపించలేదు.

ఆర్ఆర్ఆర్ లో మీ పాత్ర గురించి ?

రాజమౌళి మళ్లీ డి గ్లామరైజ్డ్ పాత్రను సృష్టించారు. ఈపాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈసినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం ఈ సినీమాకే కేటాయించాను.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో పనిచేయడం ఎలా వుంది ?

ఎన్టీఆర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటినుండో ఇక ఈచిత్రం లో మా ఇద్దరి కాంబినేషన్ సీన్లు చాలా బాగా వస్తున్నాయి. ఎన్టీఆర్ తో కలసి పనిచేస్తుండడం మంచి అనుభూతి.

మీ బ్యానర్ లో వేరే హీరోల తో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తారా ?

లేదండి. అది కేవలం నాన్న గారి సినిమాల కోసం మాత్రమే పెట్టాను. అందులో నేను హీరోగా కూడా సినిమాలు చేయను. నాకు చాలా మంచి నిర్మాతలు వున్నారు. ప్రస్తుతానికైతే వేరే హీరోలతో సినిమాలను ప్రొడ్యూస్ చేసే ఆలోచన లేదు.

Exit mobile version