
పరభాషా హీరో అయినా తను చేసిన సినమా ఆడియన్స్ కి నచ్చితే అదే హీరో సినిమాలను వరుసగా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని తమిళ చిత్ర వర్గాలు కూడా ఫాలో అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా తమిళంలో ‘మావీరన్’ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో రామ్ చరణ్ కి తమిళ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే, ఎవడు సినిమాలను డబ్ చేసి తమిళంలో రిలీజ్ చేయనున్నారు.
అందులో భాగంగా గోవిందుడు అందరివాడేలే సినిమాని రామ్ లీల సినిమా పేరుతో డబ్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇది కాకుండా ఎవడు తమిళ వెర్షన్ కి ‘మగధీర’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ తమిళ వెర్షన్ ఆడియోని ఈ రోజు చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తమిళంలో కూడా బాగా ఫేమస్ అయిన శృతి హాసన్, కాజల్ అగర్వాల్, అమీ జాక్సన్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించడం సినిమాకి బాగా హెల్ప్ అవుతోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్ లీ సినిమాని దసరా కానుకగా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.