
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తన సినిమా షూటింగ్ లో మాత్రమె కాకుండా మరో రెండు పనుల్లో కూడా చరణ్ బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఫైనలైజ్ చేయడం అలాగే ఎయిర్ లైన్స్ బిజినెస్ లో తన ఆగమనం కోసం సిద్దమవుతుండడం.
రామ్ చరణ్ – తన ఫ్రెండ్ ఉమేష్ కలిసి టర్బో మెగా ఎయిర్ వేస్ ని ప్రారంభించనున్నారని, ఈ ఎయిర్ వేస్ కి ‘ట్రూ జెట్’ అనే పేరుని ఖరారు చేసారని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం గోదావరి పుష్కరాల కానుకగా ఈ ఎయిర్ వేస్ ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే చరణ్ టీం రెండు మినీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని సిద్దం చేసి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో ఉంచారు. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ మోడల్ నెంబర్ ఎటిఆర్72-500. ఈ వారాంతం లోపు ఈ మెగా టర్బో ఫ్లైట్స్ కి డైరెక్టోరేట్ జెనెరల్ అఫ్ సివిల్ అవిఏషణ్ నుంచి క్లియరెన్స్ లెటర్ రానుంది.
ఇప్పటికే ఈ ఎయిర్ వేస్ కి సంబంధించి ఫైలట్స్, కాబిన్ స్టాఫ్ మరియు మిగతా స్టాఫ్ ని కూడా సెలక్ట్ చేసారు. మొదటి ఎయిర్ వేస్ ని హైదరాబాద్ నుంచి రాజమండ్రి పంపనున్నట్లు సమాచారం. అలాగే మొదటి సెషన్ లో హైదరాబాద్ ని బేస్ చేసుకొని ఈ ఎయిర్ లైన్ సర్వీస్ ని విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగుళూరు, ఔరంగాబాద్ లకి ట్రావెలింగ్ ప్లాన్ చేసారు.