
ఆగస్ట్ 22న ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీ యూనిట్ లండన్ వెళ్లనున్నారు.రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారు. సెప్టెంబర్ మొదటివారం వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. లండన్ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ఇటివలే రామానాయుడు సినీ విలేజ్ లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు.
ఈ సినిమాలో చరణ్ ఎన్నారై యువకుడిగా అభిరామ్ పాత్రలో కనిపిస్తారు. కుటుంబ విలువలు, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు దర్శకుడు కృష్ణవంశి. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో ఆడియో విడుదల తేది ప్రకటించనున్నారు.