చరణ్ 9వ మూవీ శాటిలైట్ రైట్స్ కి బంపర్ ప్రైజ్

Ram-charan
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలకు రిలీజ్ కి ముందే బిజినెస్ పరంగా మంచి రేటు పలకడమే కాకుండా, శాటిలైట్ రైట్స్ పరంగా కూడా భారీ రేటు పలుకుతున్నాయి. కానీ సినిమా షూటింగ్ ఇంకా 50% కూడా పూర్తికాకముందే బంపర్ ప్రైజ్ కి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 9వ సినిమా విషయంలో జరిగింది. రామ్ చరణ్ తన 9వ సినిమా షూటింగ్ శ్రీను వైట్ల డైరెక్షన్లో చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయ్యింది. కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి.

మాకు అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ 9వ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని 13 కోట్లకి జీ తెలుగు వారు కొనుక్కున్నారు. ఈ 13 కోట్లకి శాటిలైట్ తో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా జీ వారు తీసుకున్నారు. ఇంకా సగం కూడా షూటింగ్ కూడా పూర్తవని, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాని ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ ఈ రేటు పలకడం చూస్తుంటే సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. రేపటి నుంచి ఈ సినిమా న్యూ షెడ్యూల్ బ్యాంకాక్ లో మొదలు కానుంది. రామ్ చరణ్ తో మొదటి సారి రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కడుతున్న ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version