
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ కి కామెడీని జోడించి చెప్పే డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రానున్న మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ చిత్ర టీం రామ్ చరణ్ పై ఓ లేస్తేస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ఫినిష్ చేసింది. దీంతో ఈ చిత్ర టీం హైదరాబాద్ లో షూటింగ్ కి పాకప్ చెప్పి యూరప్ లో మళ్ళీ షురూ చేయనున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం మే రెండవ వారంలో ఈ చిత్ర టీం యూరప్ వెళ్లి అక్కడ మూడు పాటలను షూట్ చేయనున్నారు. పాటలతో పాటు కొన్ని సీన్స్ ని అక్కడ షూట్ చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కంటిన్యూ షెడ్యూల్ తో ఈ సినిమాని ఫినిష్ చేయనున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసమే రామ్ చరణ్ స్పెషల్ గా ది మార్షల్ ఆర్ట్స్ స్కూల్ లో జైక స్టంట్స్ పైన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో కొత్తదనం చూపించడం కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ్ చరణ్ కి సిస్టర్ పాత్రలో కృతి కర్బంద నటించనుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ కానుంది.