రామ్ చరణ్ సెటైర్ ఎవరిపై?

Ram charan1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో నేడు ఓ ఆసక్తికర పోస్ట్ పంచుకున్నారు. రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు లుక్ పోస్ట్ చేసి ”కేవలం పనికొచ్చే విషయాలనే వింటున్నాను’ అని సందేశం పోస్ట్ చేశారు. రామ్ చరణ్ ఎవరిపైనో సెటైర్ వేస్తూ ఈ పోస్ట్ చేశారని అనిపిస్తుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మకు మరియు పవన్ ఫ్యాన్స్ కి మధ్య వివాదం కొనసాగుతుంది. వర్మ పరోక్షంగా పవన్ ని ఉద్దేశిస్తూ తీసిన పవర్ స్టార్ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపదం జరిగింది. ఈ విషయంపైనే వర్మను ఉద్దేశిస్తూ చరణ్ ట్వీట్ చేసి ఉంటారనిపిస్తుంది.

నిన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మ ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది. పోలీసుల చొరవతో అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది. వర్మ పై పవన్ ఫ్యాన్స్ దాడి చేస్తున్నారని తెలిసి ఆయన ఫ్యాన్స్ అక్కడికి వచ్చారని వర్మ చెప్పుకోవడం విశేషం. రేపే వర్మ పవర్ స్టార్ మూవీ విడుదల ఉన్న నేపథ్యంలో ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో అర్థం కావడం లేదు.

Exit mobile version