వర్మ కోసం మళ్ళీ కలవనున్న మనోజ్ – జగ్గు భాయ్

jagapathi-babu-manoj

వివాదాలకు నెలవైన క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసే సినిమాలు ఈ మధ్య బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడకపోయినా ఆయన చేసే సినిమాల సంఖ్య మాత్రం అస్సలు తగ్గడం లేదు. రామ్ గోపాల్ వర్మ ఇటీవలే మనోజ్ తో ‘గొలుసు’ అనే సినిమాని అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలో మంచు మనోజ్ తో పాటు జగపతి బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 2 దశాబ్దాల ముందు రామ్ గోపాల్ వర్మ – జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గాయం’ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వర్మ – జగపతి బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.

గత సంవత్సరమే మంచు మనోజ్ – జగపతి బాబు కలిసి ‘కరెంట్ తీగ’ సినిమాలో కనిపించారు, మళ్ళీ వీరి కాంబినేషన్ లో రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ టిపికల్ వర్మ ఫార్మాట్ లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అందరి అంచనాలను అందుకునేలా ఉంటుందని అంటున్నారు.

Exit mobile version