
‘లేడీస్ ట్రైలర్’ సినిమాతో నిర్మాతగా సినీ జీవితాన్ని ప్రారంభించిన స్రవంతి రవికిషోర్ ఆ తర్వాత నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, రెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన ప్రొడక్షన్ నుంచి వస్తున్నా లేటెస్ట్ మూవీ ‘శివమ్’. ఈ సినిమాలో ఆయన వారసుడు రామ్ హీరోగా నటించాడు. అప్పట్లో వేరే హీరోలతో కూడా సినిమాలు చేసిన రవికిషోర్ రెడీ నుంచి ఓన్లీ రామ్ తోనే సినిమాలు చేస్తున్నాడు. ఎందుకు రామ్ తోనే కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన ముందు ఉంచితే..
స్రవంతి రవికోషోర్ సమాధానమిస్తూ ‘నాకు తెలిసి ఇప్పుడు డబ్బు పెట్టేవాల్లనే తప్ప అవసరం అయిన చోట ప్రశ్నించే నిర్మాతలని హీరో నడ డైరెక్టర్స్ ఇష్టపడటం లేదు. అందుకే ఆడియన్స్ కి నచ్చే సినిమాలకంటే హీరోకి నచ్చే సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి భ్రమలో నేను సినిమా చేయలేను. అందుకే 2008 నుంచి రామ్ తోనే చేస్తున్నాను. మా వాడితో ఆ సమస్య నాకు ఉండదు. అలాగే భారీ భారీ అమౌంట్ అడ్వాన్స్ గా ఇవ్వక్కర్లేదు. దానికోసం అప్పు కూడా చేయాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే రామ్ చేయూత లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాన్ని కాదు. నిర్మాతగా కూడా నేను ఇబ్బంది పడేవాన్నని’ అన్నాడు.
రామ్ – రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.